ప్రముఖ నటుడు అరెస్ట్
జైలర్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు వినాయకన్ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఓ సినిమా షూటింగ్ నిమిత్తం ఈ నెల 2వ తేదీ నుంచి కొల్లంలోని ఓ హోటల్ లో ఆయన బస చేశారు. ఆయన హోటల్ నుంచి చెక్ అవుట్ చేస్తుండగా మద్యం మత్తులో సిబ్బందితో గొడవపడ్డారు. దీంతో హోటల్ సిబ్బంది అంచలుమూడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వినాయకన్ ను అదుపులోకి తీసుకున్నారు. ఒకరు పూచీకత్తు సమర్పించడంతో ఆయనను విడుదల చేశారు.