అదంటే చాలా ఇష్టం.. కానీ జారిపోతుందేమో అనే అసలు భయం
భారతీయ సంప్రదాయంలో చీరకట్టుకు ఉన్న ప్రాధాన్యతే వేరు. ఆధునికత బాగా విస్తరించి ఈ మధ్యకాలంలో హీరోయిన్లు చీరకట్టులో కనిపించడం తగ్గించేశారు కానీ ఓ దశాబ్దం క్రిందటి వరకు ఎందరో హీరోయిన్స్ చీరకట్టులోనే ప్రేక్షకులను బుట్టలో వేసుకున్నారు. అలాంటి చీరకట్టు తనకు ఎంతో ఇష్టమని, కాకపోతే కట్టుకోవాలంటే కొంచెం భయం అని చెబుతోంది యంగ్ హీరోయిన్ పూజా హెగ్డే. ఆ వివరాలేంటో చూద్దామా,ముకుంద సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పూజా హెగ్డే, తెలుగు తెరపై స్టార్ హీరోయిన్గా ఎదిగింది. వరుస ఆఫర్స్ అందుకుంటూ మోడ్రన్ భామగా యువత మనసు దోచుకుంటోంది.