Breaking: ప్రముఖ నటుడిపై కేసు నమోదు
నటుడు అజాజ్ ఖాన్, నిర్మాత రాజ్ కుమార్ పాండేపై ముంబై పోలీసులు FIR నమోదు చేశారు. హౌజ్ అరెస్టు వెబ్ షోలో అశ్లీల కాంటెంట్ ప్రసారం చేసిన నేపథ్యంలో వారిపై కేసు నమోదు అయింది. అజాజ్ ఖాన్ హోస్ట్ చేస్తున్న ఈ వెబ్ సిరీస్ ఉల్లు యాప్లో ప్రసారం అవుతోంది. అయితే భజరంగ్ దళ్ కు చెందిన కార్యకర్త గౌతమ్ రప్రియా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా అతనిపై కేసు నమోదు చేశారు.