పవన్ హరిహర వీరమల్లు వాయిదా
హోలీ పండుగ సందర్భంగా పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 'హరిహర వీరమల్లు' సినిమా యూనిట్ మూవీపై అప్డేట్ ఇచ్చింది. చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్ ను విడుదల చేసింది. ఇందులో పవర్ స్టార్ తో పాటు ఇతర నటులు గుర్రాలపై ఉన్నారు.
ఈ సినిమా మార్చి 28న విడుదల కావాల్సిన ఈ సినిమాను మే 9న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. క్రిష్, జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. తొలి పార్టుకు 'sword vs spirit' ట్యాగ్ ను ఖరారు చేశారు.