అలసిపోయాను ఇక చాలు అన్నా వదలడు : పవిత్ర లోకేష్
తాజాగా ఓ సినిమా వేడుకలో నరేష్, పవిత్ర లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవిత్ర లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నరేష్ ఒక్కడిలోనే పది మందిలో ఉండే ఎనర్జీ ఉంటుందని చెప్పారు. ఆయన ఎనర్జీని ఎవరూ తట్టుకోలేరు అని అన్నారు. 'ఆయనతో నేను పోటీ పడలేను. అలిసిపోయిన నేను చాలాసార్లు ఇక చాలు అంటాను. కానీ ఆయన అలిసిపోడు' అని పవిత్ర లోకేష్ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.