నాగ్ ఫై సంచలన కామెంట్స్ చేసిన పవిత్ర లోకేష్..
పవిత్ర లోకేష్ గుర్తుంది కదా, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, రేసుగుర్రం, మిస్టర్ మజ్ను మొదలగు సినిమాల్లో నటించిన పవిత్ర టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నారు, తెలుగు ఈమె చేసింది తక్కువ సినిమాలే అయినప్ప్పటికీ కన్నడ లో స్టార్ హీరోయిన్గా పవిత్రకి ఎంతో గుర్తింపు ఉంది. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 100 చిత్రాలకు పైగా నటించి కన్నడ ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ప్రస్తుతం తెలుగు లో ఈమెకు వదిన, తల్లి పత్రాలు వస్తున్నాయి.
తాజాగా ఈమె ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలు తెలియజేసి వార్తల్లో నిలిచింది. ముఖ్యంగా టాలీవుడ్ మన్మధుడు నాగార్జునఫై కొన్ని కామెంట్స్ చేయడం చర్చగా మారింది. అక్కినేని నాగార్జున గురించి మాట్లాడుతూ నాగార్జునని కలిసాను కాని మాట్లాడలేదు, అంత ధైర్యం లేదు. నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు నాగార్జున గారి ‘గీతాంజలి’ సినిమా చూశా. ఆ టైమ్లో నా ఫీలింగ్ ఇలాంటి మ్యాన్ ఉండాలి నా లైఫ్లో అని. అలా నాగార్జునపై క్రష్ ఉండేది. దాన్ని క్రష్ అనుకోండి ఏదో ఒకటి అనుకోండి. రెండు మూడు సార్లు ఆయన్ని కలిశా. అదే నా ఫస్ట్ క్రష్ అనుకోవచ్చు అని చెప్పారు.