జానీ మాస్టర్ కు బిగుస్తున్న ఉచ్చు

Entertainment Published On : Thursday, December 26, 2024 04:30 PM

జానీ మాస్టర్ కేసులో చార్జ్ షీట్ దాఖలు చేశారు నార్సింగ్ పోలీసులు. ఈవెంట్ పేర్లతో పలు ప్రాంతాలకు తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాటుపడినట్లు పోలీసుల నిర్ధారించారు.లేడీ కొరియోగ్రాఫర్‌పై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.

ఈవెంట్స్ పేరుతో ఇతర ప్రాంతాలకు ఆమెను తీసుకెళ్లి, ఆమెపై లైంగిక దాడులకు పాల్పడినట్లు పోలీసులు తమ ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. అంతేకాదు జానీ మాస్టర్ గత కొంతకాలంగా తనను లైంగికంగా వేధిస్తున్నాడు అంటూ.. మహిళ అసిస్టెంట్ డాన్స్ మాస్టర్ సెప్టెంబర్ 15వ తేదీన నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాద్ చేసింది..ఇప్పుడు ఆమె మాటలు నిజమేనని తేల్చారు పోలీసులు కాగా, అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు.. జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేశారు. ఆ తరువాత కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో అక్టోబర్ 25వ తేదీన చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు.