పూరీ జగన్నాథ్ తో నాగార్జున సినిమా?
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో అక్కినేని నాగార్జున ఓ సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూరీ చెప్పిన స్టోరీ నాగార్జునకు నచ్చిందని, చర్చలు కొనసాగుతున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి.
గతంలో వీరిద్దరి కాంబినేషన్లో 2003లో శివమణి, 2005లో సూపర్ సినిమాలు వచ్చాయి. విక్టరీ వెంకటేశ్, అక్కినేని అఖిల్ తోనూ పూరీ జగన్నాథ్ సినిమాలు చేయనున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.