OTTలోకి వచ్చేస్తున్న ముఫాసా
ది లయన్ కింగ్ మూవీకి ప్రీక్వెల్ గా వచ్చిన 'ముఫాసా' సినిమా రేపు ఓటీటీలోకి రానుంది. జియో హాట్ స్టార్ లో తెలుగుతో పాటు ఇంగ్లిష్, హిందీ, తమిళంలో స్ట్రీమింగ్ కానుంది. కాగా తెలుగులో ముఫాసాకు మహేశ్ బాబు, హిందీలో షారుఖ్ ఖాన్ డబ్బింగ్ చెప్పారు. డిస్నీ రూపొందించిన ఈ మ్యూజికల్ లైవ్ యాక్షన్ మూవీ గతేడాది విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.