డైరెక్టర్ కు మెగాస్టార్ ఖరీదైన బహుమతి
మెగాస్టార్ చిరంజీవి తన సహనటులు, సాంకేతిక నిపుణుల పట్ల చూపించే ఆదరాభిమానాలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా, ప్రముఖ డైరెక్టర్ బాబీ పట్ల తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చిరంజీవి మరోసారి చాటుకున్నారు. అతడికి ఓ ఖరీదైన వాచ్ను బహుమతిగా అందించి, బాబీని ఆనందంలో ముంచెత్తారు. ఈ అనూహ్య కానుకకు బాబీ తీవ్ర భావోద్వేగానికి గురై కృతజ్ఞతలు అన్నయ్య, మీరు నాపై చూపిన ప్రేమ వెలకట్టలేనిది అంటూ "X" వేదికగా పోస్ట్ పెట్టారు.