రాజకీయాల్లోకి రీఎంట్రీ.. చిరంజీవి సంచలన ప్రకటన

Entertainment Published On : Wednesday, February 12, 2025 08:00 AM

మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన చేశారు. ఈ జన్మంతా రాజకీయాలకు దూరంగా ఉంటానని 'బ్రహ్మా ఆనందం' ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఆయన ప్రకటించారు. ఇకపై కళామతల్లి సేవలోనే గడిపేస్తానని చెప్పారు.

రాజకీయ పెద్దలను కలిసేది పాలిటిక్స్ కోసమేనంటూ కొందరు ప్రచారం చేస్తున్నారని, కానీ తాను సినీ రంగానికి అవసరమైన సహకారం కోసమే కలుస్తున్నానని స్పష్టం చేశారు. తన లక్ష్యాలు, సేవాభావాన్ని పవన్ కళ్యాణ్ నెరవేరుస్తారని చిరంజీవి చెప్పుకొచ్చారు.