శ్రీలీలకు చిరంజీవి స్పెషల్ గిఫ్ట్
హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ గిఫ్ట్ అందజేశారు. నిన్న మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీలీలకు చిరంజీవి ఈ ప్రత్యేక బహుమతిని అందించారు. విశ్వంభర సెట్స్ లో చిరంజీవిని చూసేందుకు శ్రీలీల వెళ్లారు.
ఈ సందర్భంగా కాసేపు మాట్లాడుకున్న అనంతరం ఆమెకు చిరు ఓ శంఖాన్ని బహుమతిగా ఇచ్చారు. బంగారు, వెండి పూతలో దుర్గాదేవి విగ్రహం ఆ శంఖంపై చెక్కి ఉంది. శ్రీలీల తన ఇన్స్టాలో ఈ విషయాన్ని పోస్ట్ ద్వారా పంచుకున్నారు.