మెగా అభిమానులకు చిరంజీవి గుడ్ న్యూస్
మెగా అభిమానుల కోసం మెగాస్టార్ చిరంజీవి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది మెగాస్టార్ చిరంజీవి సినిమాలేవీ విడుదల కాలేదు. ఈ ఏడాది విశ్వంభరను దించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.
వచ్చే ఏడాది ముగిసేలోపు మరో రెండు సినిమాల్ని రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. విశ్వంభర షూటింగ్ దాదాపు పూర్తి అయింది. తర్వాత అనిల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెలతో సినిమాల్ని వేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది చివరిలోపు విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారని సినీవర్గాలు వెల్లడిస్తున్నాయి.