మూసివేతకు సిద్ధమైన మాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ
మలయాళ సినీ ఇండస్ట్రీ మూతపడనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మలయాళ సినిమా భారీ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. నిర్మాణ ఖర్చులు భారీగా పెరిగిపోవడంతో ప్రొడ్యూసర్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి పరిశ్రమను మూసివేసేందుకు సిద్ధమైనట్లు ప్రకటించారు.
అధిక పన్నులు, నటీనటులు రెమ్యునరేషన్ పెంచడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రొడక్షన్, స్క్రీనింగ్లతో సహా అన్ని చలనచిత్ర కార్యకలాపాలను నిలిపివేస్తామని ప్రకటించారు.