విజయశాంతి పైన అసంతృప్తిగా ఉన్న మహేష్ !
మహేష్ విజయశాంతి అత్తా అల్లుళ్ళ కాంబినేషన్ తో రాబోతున్న సినిమా సరిలేరు నీకెవ్వరు మూవీ షూటింగ్ కూడా ప్రారంభం కాకుండానే ఈమూవీని అత్యధిక రేట్లకు బయ్యర్లు కొనడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. విజయశాంతి చాల గ్యాప్ తీసుకుని మళ్ళీ సినిమాల వైపు రావటంతో ఆమె హాట్ టాపిక్ గా మారి అనేక మీడియా సంస్థలు ఆమెతో ఇంటర్వ్యూలు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో విజయశాంతి తన వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలు షేర్ చేస్తూ మహేష్ తో తాను నటిస్తున్న సినిమా కథ గురించి అదేవిధంగా ఆమూవీలోని తన పాత్ర గురించి లీకులు ఇచ్చింది.
నిర్మాణంలో ఉన్న టాప్ హీరోల సినిమాల కథల గురించి అందులోని ట్విస్ట్ లు గురించి ముందుగా తెలిసిపోతే ఆమూవీ పై క్రేజ్ పడిపోతుంది. దీనితో ఎలర్ట్ అయిన మహేష్ విజయశాంతికి ఈమూవీ దర్శకుడు అనీల్ రావిపూడి ద్వారా సున్నితమైన హెచ్చరికలు ఇప్పించినట్లు టాక్.