మహేశ్ బాబు హాలివుడ్ ఎంట్రీ ...?
మహేశ్, మురుగదాస్ కాంబోలో వచ్చిన సినిమా "స్పైడర్" బాక్సాఫీస్ వద్ద చతికిలపడి మహేశ్ కెరీర్ లో భారీ డిజాస్టర్ గా నిలిచింన విషయం మనకి తెలిసిందే, కానీ ఇంత జరిగినా మళ్లీ అదే డైరెక్టర్ తో సినిమా చేసేందుకు మహేష్ రెడీ అవుతున్నాడు. ఈసారి టాలివుడ్, కోలివుడ్ సినిమా కాదు ఏకంగా హాలివుడ్ మూవీనే ప్లాన్ చేస్తున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.
రీసెంట్ గా హాలివుడ్ నటుడు బిల్ డ్యూక్ మహేశ్ బాబుతో పాటుగా డైరెక్టర్ మురుగదాస్ని లాస్ ఏంజిల్స్ లోని తన ఇంటికి లంచ్కి రావాల్సిందిగా ట్విట్టర్ ద్వారా ఆహ్వానించడం వలన ఈ రూమర్స్ మొదలుఅయ్యాయి. అంతేకాదు మహేశ్ తో కలిసి ఓ స్పై మూవీలో నటించాలనుందని స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేద్దామని ట్వీట్ లో పేర్కొన్నాడు. అందుకే మహేశ్, మురుగదాస్ కాంబోలో హాలివుడ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని రూమర్స్ ఓ రేంజ్ లో నడుస్తున్నాయి. ఒకవేళ అన్నీ కలిసొచ్చి నిజంగానే మహేశ్ హాలివుడ్ కి వెళ్తే ఫ్యాన్స్ ఆనందానికి అడ్డు అదుపు ఉండదు.