ఎల్లమ్మ సినిమాలో నితిన్ సరసన కీర్తి సురేశ్?
'బలగం' డైరెక్టర్ వేణు దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కనున్న 'ఎల్లమ్మ' మూవీ షూటింగ్ మేలో ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేశ్ నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఆమెకు డైరెక్టర్ కథ చెప్పినట్లు తెలుస్తోంది.
దీనికి ఆమె వైపు నుండి గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. తొలుత సాయిపల్లవిని హీరోయిన్ గా తీసుకోవాలనుకున్నారని, డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఆమె తప్పుకున్నట్లు వార్తలొస్తున్నాయి.