ఎలాంటి బట్టలు వేసుకోవాలో, ఎవరితో పడుకోవాలో ఆయనే డిసైడ్ చేస్తాడు: కంగన సొదరి
బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహర్‌పై కంగన రనౌత్ సోదరి రంగొలి చండేల్ విరుచుకుపడ్డారు. ఇషాన్ కట్టర్‌ను ధర్మ ప్రొడక్షన్ సినిమాల్లో నుంచి కరణ్ తొలగించారని కమల్ ఖాన్ చేసిన వ్యాఖ్యలకు రంగోలి ఆజ్యం పోశారు. ఇద్దరు కలిసి కరణ్ జోహర్‌పై పలు ఆరోపణలతో విరుచుకుపడ్డారు. ఇంతకు ఆ వివాదానికి కారణం ఏమిటంటే, ఇషాన్‌ను కరణ్ జోహర్ వేధిస్తున్నాడు. ఫలానా హీరోయిన్‌తో కలిసి ఉండు, ఆ హీరోయిన్‌కు బ్రేకప్ చెప్పు అంటూ కరణ్ శాస్తిస్తున్నాడు అని రంగొలి అన్నారు. తారల వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నాడు అంటూ కరణ్‌పై కంగన సోదరి తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.
కమల్ ఖాన్ ట్వీట్ నేపథ్యంలో కంగన సోదరి రంగోలి స్పందించారు. కరణ్ ఆలాంటి వ్యక్తే. తనకు నచ్చకపోతే ఎంతకైనా దిగజారుతాడు. అలాంటి నిర్ణయాలు తీసుకోవడంలో కరణ్ సిద్ధహస్తుడు. ఇషాన్ తొలగించారనే వార్త నాకు ఆశ్చర్యం కలిగించలేదు. ఇలాంటివి ఆయన సొంత నిర్మాణ సంస్థలో సాధారణమే అని రంగోలి అన్నారు. తాను చేసే ఈవెంట్లు, పనుల్లో హీరో, హీరోయిన్లకు వచ్చే రెమ్యునరేషన్లలో ఎక్కువ భాగం కరణ్ జోహర్ తీసుకొంటాడు. ఈవెంట్లలో ఎలాంటి బట్టలు వేసుకోవాలో ఆయనే చెబుతాడు. ఎవరు ఎవరితో పడుకోవాలనే విషయాన్ని కూడా కరణ్ జోహర్ నిర్ణయిస్తాడు. హాలీవుడ్లో ఇలాంటి సంప్రదాయం ఉంటుంది. అలాంటిది ఇక్కడ కరణ్ జోహర్ అమలు చేస్తున్నాడు అని రంగోలి ధ్వజమెత్తింది.