Breaking: ప్రముఖ దర్శకుడు కన్నుమూత
ప్రముఖ కన్నడ దర్శకుడు AT రఘు (76) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుది శ్వాస విడిచారు. కన్నడ రెబల్ స్టార్ అంబరీశ్ తో ఆయన ఎక్కువ సినిమాలు చేశారు.
తొలి సారిగా 'న్యాయ నీతి ధర్మ' సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు. 55 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.