స్మగ్లింగ్ కేసులో హీరోయిన్ రన్యారావుకు రిలీఫ్
గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కన్నడ యాక్టర్ రన్యారావుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమెతోపాటు తరుణ్ రాజ్ కొండూరుకు బెంగళూరు కోర్టు మంగళవారం బెయిల్ ఇచ్చింది. రూ.2లక్షల చొప్పున వ్యక్తిగత బాండ్, ఇద్దరి పూచీకత్తుతో ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు ఇద్దరికి కడీషనల్ బెయిల్ను మంజూరు చేసింది. అధికారులు పిలిస్తే తప్పనిసరిగా విచారణకు హాజరుకావాలని.. సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించొద్దని నిందితులను హెచ్చరించింది.