హస్పిటల్‌లో కనికాకపూర్ పరిస్థితి దారుణం, కర్టెన్ చాటునే దుస్తులు..!
బాలీవుడ్ సింగర్ కనికాకపూర్ వ్యవహారం, ఆమె ప్రవర్తించిన తీరు అన్ని వర్గాల నుంచి విమర్శలకు గురైంది. లండన్ నుంచి మే మూడో వారంలో భారత్‌కు వచ్చిన కనికాకపూర్ కరోనాకు సంబంధించి ఎలాంటి నిర్ధారణ పరీక్షలకు హాజరుకాకుండా దొంగదారిన లక్నోలోని ఫైవ్ స్టార్ హోటల్‌కు వెళ్లారనేది ప్రధానమైన ఆరోపణ. ఈ క్రమంలో మాజీ సీఎం వసుంధరా రాజే, ఆయన కుమారుడు దుష్కంత్ సింగ్ ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నారనే విషయం రాజకీయంగా అత్యంత వివాదంగా మారింది.
వివరాలలోకి వెళితే కనికా కపూర్‌ను మార్చి 19న మధ్యాహ్నం 3.30 గంటలకు పరీక్షించడానికి వైద్యులు ఇంటికి వచ్చారు. మార్చి 20వ తేదీ ఉదయం 8 గంటలకు కరోనా పాజిటివ్ అనే రిపోర్టును తెలిపారు. అదే ఉదయం ఆమెను అంబులెన్స్‌లోకి ఎక్కించి లక్నోలోని పీజీఐ హాస్పిటల్‌కు తరలించారు. ఆమె వెంటనే మేము కారులో హాస్పిటల్‌కు వచ్చాము అని కుటుంబ సభ్యులు తెలిపారు. డాక్టర్లు దుస్తులు మార్చుకోవాలని సూచించటంతో ఆ పక్కనే కర్టెన్ చాటుకు వెళ్లి బట్టలు మార్చుకోమంటే ఆమె నిరాకరించారు. ఆ తర్వాత క్వారంటైన్ రూమ్ చాలా దారుణంగా ఉండటం వల్ల దానిని క్లీన్ చేయమంటే వైద్య సిబ్బంది మండిపడ్డారు. ఆ క్రమంలోనే చికిత్సకు సహకరించడం లేదు అని , సెలబ్రిటీలా వ్యవహరిస్తున్నదని ఆమెపై కొన్ని ఆరోపణలు చేశారు. రూమ్‌లో టీవీ లేదు. కరోనా నేపథ్యంలో బయట ఏం జరుగుతున్నదనే విషయం తెలియకుండా ఎలాంటి సమాచారం అందడం లేదు అని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి మెరుగైన సదుపాయాలు లేకుండానే ఆమెకు చికిత్స చేస్తున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు.