కనికాకపూర్ పరిస్థితి దారుణం, వరుసగా మూడోసారి.
సింగర్ కనికాకపూర్ వ్యవహారాన్ని ఉత్తరప్రదేశ్ పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. కరోనావ్యాధితో బాధ్యతారాహిత్యంగా లక్నోలో పలువురు రాజకీయ నాయకులు పాల్గొన్న విలాసవంతమైన విందుకు హాజరకావడం అత్యంత వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దాంతో నిర్లక్షపూరితంగా వ్యవహారించారనే ఆరోపణలపై లక్నో మెడికల్ కాలేజీ హాస్పిటల్ చీఫ్ మెడికల్ డాక్టర్ ఫిర్యాదు మేరకు ఆమెపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమెకు ఇంకా కరోనావైరస్ తీవ్రస్థాయిలోనే ఉందనే విషయం తాజాగా మరోసారి వెల్లడైంది.
లండన్ నుంచి వచ్చిన కనికాకపూర్ కరోనావైరస్ బారిన పడ్డారు. ఆ తర్వాత రోగ లక్షణాలు గుర్తించిన వైద్యులు ఆమెకు మార్చి 20న, మార్చి 23న నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. తాజాగా మూడోసారి నిర్వహించిన పరీక్షల్లో కరోనావైరస్ ఆమెకు తీవ్రస్థాయిలో ఉన్నదనే విషయాన్ని వైద్యులు మరోసారి నిర్దారించారు.