మెగా స్టార్ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ నటి
డైరెక్టర్ వశిష్ట మరోసారి సోషియో ఫాంటసీ కథతో చిరంజీవి సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ సినిమాలో చాలా మంది హీరోయిన్స్ కనిపించనున్నారని ప్రచారం జోరుగా కొనసాగుతుంది. అలాగే ఓ అందాల భామ మెగాస్టార్ చిరంజీవి సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుందనీ చిత్రవర్గాలు చెబుతున్నాయి. 'ప్రేమకావాలి' సినిమాతో పరిచయమైన ఇషా చావ్లా మరోసారి చిరంజీవితో ఇండస్ట్రీలో అడుగుపెట్టనున్నారు.