బ్రేకప్ వార్తలపై స్పందించిన తమన్నా
బ్రేకప్ రూమర్స్ పై మిల్కీ బ్యూటీ హీరోయిన్ తమన్నా స్పందించారు. ప్రేమించే వారిని వారికి నచ్చినట్లు ఉండనివ్వాలని, ప్రేమకు, రిలేషన్కు మధ్య తేడా ఉంటుందని అన్నారు. అవతలి వారు తమకు నచ్చేలా ఉండాలనుకుంటే అది బిజినెస్ అవుతుందని, కానీ 'లవ్' కాదని చెప్పారు.
నిస్వార్థమైన ప్రేమ ఎప్పుడూ వన్సైడ్ లవ్ లోనే ఉంటుందని అన్నారు. యూట్యూబ్ పాడ్కాస్ట్ లో ప్రేమపై తన అభిప్రాయాన్ని తమన్నా తెలియజేశారు. కాగా తమన్నా ఇటీవలే లవర్ విజయ్వర్మతో బ్రేకప్ చెప్పారని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.