హీరోయిన్ శ్వేత బసు సంచలన వ్యాఖ్యలు
కొత్త బంగారు లోకం సినిమాతో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్ శ్వేత బసు ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ తెలుగు చిత్రంలో నటిస్తున్న సమయంలో తన ఎత్తును గుర్తు చేస్తూ సెట్లోని వారు ఎగతాళి చేసినట్లు చెప్పారు.
హీరో దాదాపు 6 ఫీట్ల హైట్ ఉండటంతో ఇలా జరిగిందన్నారు. చాలా సీన్లు రీటేక్ చేశారని తెలిపారు. ఈ బ్యూటీ తర్వాత పలు వివాదాల్లో చిక్కుకొని తెలుగు సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. ఆమె ప్రస్తుతం బాలీవుడ్లో నటిస్తున్నారు.