బామ్మ పాత్ర అయినా నటిస్తా: రష్మిక
తనకు కథ నచ్చితే బామ్మ పాత్ర అయినా, ఇద్దరు పిల్లల తల్లిగానైనా నటించడానికి సిద్ధమని హీరోయిన్ రష్మిక మందన్న తెలిపారు. తాను నటించిన 'ఛావా' మూవీ ఈవెంట్లో ఆమె మాట్లాడారు.
తాను నటించే సినిమాలో ఏం చేస్తున్నాననే దానితో తనకు సంబంధం లేదని, కథ తనను ఆకట్టుకుంటే చాలని తెలిపారు. బామ్మ పాత్ర అయినా, ఇద్దరు పిల్లల తల్లిగా నటించడానికైనా తాను సిద్ధమని, తాను అనుకోకుండా ఎంచుకున్న సినిమాలే ప్రేక్షకుల్ని మెప్పించాయని ఆమె చెప్పుకొచ్చారు.