తల్లి కాబోతున్న హీరోయిన్ లావణ్య త్రిపాఠి

Entertainment Published On : Tuesday, May 6, 2025 02:08 PM

మెగా ఇంటికి వారసుడు రాబోతున్నాడు. తాను తల్లి కాబోతున్నట్టు మెగా కోడలు లావణ్య త్రిపాఠి ప్రకటించారు. ఈ విషయాన్ని లావణ్య తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దీంతో మెగా ఫ్యామిలీ సంతోషంలో మునిగి తేలుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు వెల్ కమ్ బుల్లి మెగా హీరో అంటూ విషెష్‌ పెడుతున్నారు. లావణ్య త్రిపాఠి మెగా హీరో వరుణ్ తేజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

వరుణ్ తేజ్‌, లావణ్య త్రిపాఠి ఇద్దరి కలిసి రెండు సినిమాల్లో నటించారు. మిస్టర్, అంతరిక్షం సినిమాల్లో వీరిద్దరు జంటగా కనిపించారు. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. లావణ్య త్రిపాఠితో ప్రేమాయణం సాగించిన వరుణ్ తేజ్ తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్లాడు. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకరించడంతో మెగా ఇంట్లో పెళ్లి బాజాలు మోగాయి.

బికినీల్లో అందమైన ఇండియన్ ఆంటీలు - ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...