హీరోయిన్ లైలాకు వింత సమస్య
మంచి గుర్తింపు తెచ్చుకున్న పాతతరం హీరోయిన్లలో లైలా ఒకరు. ఆమె ఇటీవల తనకున్న వింత సమస్య గురించి చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తాను నవ్వకుండా ఉండలేనని, నవ్వు ఆపేస్తే తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తాయని చెప్పింది.
శివపుత్రుడు సినిమా షూటింగ్ సందర్భంగా విక్రమ్ ఓ నిమిషం పాటు నవ్వకుండా ఉండాలని ఛాలెంజ్ విసిరారని, అయితే 30 సెకన్లకే తాను ఏడ్చేశానని చెప్పుకొచ్చారు. దీంతో మేకప్ అంతా పాడైపోయిందని వివరించారు. ఆమె చెప్పిన వింత సమస్యపై పలువురు వివిధ కామెంట్స్ చేస్తున్నారు.