ప్రభాస్ అనే పేరు అందుకే పెట్టారు
తనకు ప్రభాస్ అనే పేరు ఎందుకు పెట్టారో..దాని వెనక కారణం ఏమిటో హీరో ప్రభాస్ వెల్లడించారు. తన అమ్మ వాళ్ల తరఫున అంటే మదర్ సిస్టర్స్ ముగ్గురు ఉన్నారని, వాళ్ల పిల్లల పేర్లు ప్రభోద్, ప్రగతి, ప్రమోద్, ప్రకాష్, ప్రశాంతి, ప్రవీణ్, ప్రదీప్తి, ప్రకీర్తి, ప్రసీద.., ఇలా తనకే కన్ఫ్యూజ్ అయ్యేలా పేర్లు ఉంటాయని తెలిపారు.
ఇలానే ఇటు సైడ్ సిస్టర్స్, పెద్దనాన్న గారి కూతుళ్లు, తమ కుటుంబంలో చాలా మంది పేర్లు "ప్ర"తో మొదలవుతాయని, అందరికీ అలా అనుకొని పెట్టారని, అందుకే తన పేరు ప్రభాస్ అని పెట్టారని వెల్లడించారు.