సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో గోపీచంద్ కొత్త సినిమా
టాలీవుడ్ హీరో గోపీచంద్ కొత్త సినిమాపై అప్డేట్ వచ్చింది. దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో 'Gopichand33' తెరకెక్కనున్నట్లు మేకర్స్ ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
కాగా గతేడాది రిలీజైన గోపీచంద్, కావ్యా థాపర్ జంటగా నటించిన 'విశ్వం' మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. సంకల్ప్ రెడ్డి గతంలో ఘాజీ, అంతరిక్షం సినిమాలను తెరకెక్కించారు.