అల్లు అర్జున్ కు బెయిల్ ఇవ్వద్దు: పోలీసులు

Entertainment Published On : Tuesday, December 31, 2024 04:23 PM

పుష్ప-2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ ఘటనలో అరెస్ట్ అయిన హీరో అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ ఇవ్వద్దంటూ పోలీసులు నాంపల్లి కోర్టును కోరారు. అల్లు అర్జున్ డబ్బు మరియు పలుకుబడి ఉన్న వ్యక్తి అని, బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. అంతకు ముందు అల్లు అర్జున్ పోలీస్ స్టేషన్ లో కూడా సహకరించలేదని, అందుకే అరెస్ట్ చేశామని తెలిపారు. ఇప్పుడు బెయిల్ ఇస్తే మళ్లీ ఇదే పరిస్థితి ఎదురవుతుందని... కేసు విచారణకు సహకరించే అవకాశం ఉండదని పోలీసులు వాదిస్తున్నారు.