విజయ్ సేతుపతితో పూరి కొత్త సినిమా
దర్శకుడు పూరీ జగన్నాథ్ తన కొత్త సినిమాను ప్రకటించారు. స్టార్ హీరో విజయ్ సేతుపతితో కొత్త సినిమాను చేయనున్నట్లు పూరీ కనెక్ట్స్ ద్వారా వెల్లడించారు. పలు భాషల్లో ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు విజయ్ సేతుపతి, ఛార్మితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు.
ఈ ఏడాది జూన్ లో ఆ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని ప్రకటించారు. రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత పూరీ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆ తర్వాత వచ్చిన లైగర్, డబుల్ ఇస్మార్ట్ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.