రాబిన్ హుడ్ లో డేవిడ్ వార్నర్ స్పెషల్ లుక్..!
హీరో నితిన్, యంగ్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన 'రాబిన్ హుడ్' సినిమా ఈ నెల 28న విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో ప్రత్యేక పాత్ర పోషించారు. ఆయన ఫస్ట్ లుక్ ను మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేసింది.
'బౌండరీ నుంచి బాక్సాఫీస్ కు వస్తున్న వార్నర్ కు భారత సినిమా పరిశ్రమలోకి స్వాగతం' అన్న ట్యాగ్ లైన్ పోస్టర్ పై జత చేసింది. దీంతో క్రికెట్ అభిమానులు ఆయన లుక్ అదిరింది అంటూ కామెంట్ చేస్తున్నారు.