ఓటీటీలోకి డాకు మహారాజ్
బాలకృష్ణ, బాబీ కాంబినేషన్లో తెరకెక్కిన డాకు మహారాజ్ సినిమా ఓటీటీలోకి రానుంది. ఈ నెల 21 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ ఇండియా సౌత్ ఎక్స్ లో వెల్లడించింది.
'అనగనగా ఒక రాజు.. చెడ్డవాళ్లు అందరూ డాకు అనేవాళ్లు.. కానీ మాకు మాత్రం మహారాజు' అని రాసుకొచ్చింది. గత నెల 12న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం రూ.170 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది.