శ్రీదేవిని చంపేశారు అంటూ బోనీకపూర్ సంచలన వ్యాఖ్యలు...!
అతిలోక సుందరిగా పేరుతెచ్చుకున్న శ్రీదేవి గతేడాది ఫిబ్రవరి 24న దుబాయ్‌లో తన కుటుంబానికి చెందిన ఓ ఫంక్షన్‌కెళ్లి అక్కడ మరణించిన విషయం మనకి తెలిసిందే. శ్రీదేవి మరణవార్త తెలిసి తన అభిమానులు తీవ్ర దిగ్భాంతికి గురయ్యారు. బాత్ టబ్‌లో పడిపోయి ఊపిరాడక చనిపోయారని యూఏఈ అధికారులు కూడా ధ్రువీకరించారు. అయితే ఇప్పుడు శ్రీదేవీది సహజ మరణం సహజ మరణం కాదని కేరళ పత్రిక కేరళ అయిన "కౌముదిలో" కేరళ జైళ్ల శాఖ డీజీ రిషిరాజ్ సింగ్ ఓ ఆర్టికల్ రాశారు. దీంతో ఈ విషయంపైన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగుతోంది.
వివరాలలోకి వెళితే దుబాయ్‌లోని ఓ హోటల్లో ఫిబ్రవరి 24, 2018న ప్రమాదవశాత్తు బాత్ టబ్‌లో మునిగి శ్రీదేవి చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ మరణంపై ఇప్పటికీ ఎన్నో అనుమానాలున్నాయి. అయితే పోస్ట్‌మార్టమ్ నివేదిక మాత్రం ఆమెది సహజమరణమేనని తేల్చింది. ఈ మరణంపైనా రిషిరాజ్ సింగ్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు, తన ఫ్రెండ్ ఫోరెన్సిక్ నిపుణుడైన ఉమదతన్‌తో ఇదే విషయాన్ని చర్చించినప్పుడు ఆయనకూడా ఇది సహజ మరణం కాకపోవచ్చని అన్నారని సింగ్ పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఈ విషయంలో మాట్లాడేందుకు తన మిత్రుడు జీవించిలేరని అన్నారు. అయితే ఆ పోలీస్ అధికారి చేసిన ఆరోపణలను శ్రీదేవి భర్త బోనికపూర్ తప్పుపట్టారు. ఇలాంటి అంశాలను ప్రస్తావించే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి మాట్లాడితే బాగుంటుందని సూచించారు. ఇలాంటి పిచ్చిపనులపై తాను స్పందించనవసరం లేదని స్పష్టంచేశారు .