అమీర్ ఖాన్ కు బిగ్ షాక్
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కు నెటిజన్లు బిగ్ షాకిచ్చారు. అమీర్ ఖాన్ కొత్త చిత్రం 'సితారే జమీన్ పర్'ను బాయ్కాట్ చేయాలని నెటిజన్లు పిలుపునిచ్చారు. టర్కీ అధ్యక్షురాలితో అమీర్ ఖాన్ గతంలో దిగిన ఫోటోలు వైరల్ కావడమే ఈ బాయ్కాట్ కి కారణమని తెలుస్తోంది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ను ఎదుర్కొనేందుకు పాకిస్థాన్ కు టర్కీ భారీగా డ్రోన్లు, సైన్యాన్ని సాయంగా అందించిందని మండిపడుతున్నారు.