నా జీవితంలో మరచిపోలేని సమయం ఇది, అల్లు అర్జున్ భావోద్వేగం
అల, వైకుంఠపురములో విజయం ఆయనలో సంతోషాన్ని రెట్టింపు చేసింది. ఈ సక్సెస్ పట్ల అల్లు ఫ్యామిలీ అంతా ఫుల్ ఖుషీ అవుతోంది. ఈ మేరకు తన అభిమానులకు, తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ థాంక్స్ చెబుతూ భావోద్వేగపూరితంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు అల్లు అర్జున్. వివరాల్లోకి పోతే, సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చింది అల, వైకుంఠపురములో మూవీ. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ మూవీ తొలి షోతోనే సక్సెస్ టాక్ తెచ్చుకొని ఈ ఏడాదికి కిక్ స్టార్ట్ ఇచ్చింది.