నా తప్పేం లేదు.. అవన్నీ తప్పుడు ఆరోపణలే: అల్లు అర్జున్ ప్రెస్ మీట్

Entertainment Published On : Saturday, December 21, 2024 10:02 PM

సంధ్య థియేటర్ సంఘటన గురించి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన నేపథ్యంలో. ఇవాళ అల్లు అర్జున్ మరియు అల్లు అరవింద్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ అనేక విషయాలు వెల్లడించారు.

థియేటర్ తనకు గుడిలాంటిది, అక్కడ ఇలాంటి ప్రమాదం జరగడం చాలా బాధగా ఉందని అన్నారు. పోలీసులు, అధికారులు మరియు థియేటర్ సిబ్బంది అందరూ కలిసి కష్టపడి పనిచేసినా, ఈ ఘటన దురదృష్టకరం అని విచారం వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట గురించి మాట్లాడారు. పోలీసులు  ముందే రావొద్దని చెప్పినా అల్లు అర్జున్ వచ్చారు. బాధిత కుటుంబాన్నిఏ ఒక్క సినిమా సెలెబ్రిటీ పరామర్శించలేదు, అల్లు అర్జున్ కు ఏ ప్రమాదం జరగలేదు కదా వంటివి విషయాలు మాట్లాడారు.

 సీఎం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించి, "నాపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలే, నేను ఎలాంటి ర్యాలీ నిర్వపించహించలేదు. థియేటర్ కు కొద్ది దూరంలోనే కారు ఆగిపోయింది. పోలీసులు చేయి చూపించి ముందుకు వెళ్లమంటేనే వెళ్లాను. ఘటన జరిగిన తర్వాత హాలులో ఉన్న నాకు ఎవ్వరూ బయట జరిగిన దాని గురించి చెప్పలేదు. అయితే, థియేటర్ వద్ద జనాలు ఎక్కువగా ఉన్నారని థియేటర్ యాజమాన్యం వచ్చి చెబితేనే నేను నా భార్య బయటకు వచ్చేశాం. రేవతి అనే మహిళ చనిపోయిన విషయం మరుసటి రోజు వరకూ నాకు తెలియలేదు. ఆ తర్వాత బన్నీ వాసుకు ఫోన్ చేసి, ఆస్పత్రికి వెళ్లమని చెప్పాను. నేను కూడా వెళ్లాలని సిద్ధమయ్యా, అయితే అప్పటికే నాపై కేసు నమోదు చేశారని వాసు చెప్పాడు. నా లీగల్ టీమ్ కూడా వెళ్లొద్దని వారించడంతో ఆస్పత్రికి వెళ్లలేదని చెప్పుకొచ్చారు."

"నా వ్యక్తిత్వంపై చేసిన ఆరోపణలు అన్నీ నూటికి నూరు శాతం అబద్ధం. ప్రస్తుతం న్యాయపరమైన చిక్కులు ఉండటంతో మీ ప్రశ్నలన్నింటికీ త్వరలోనే సమాధానం చెబుతా" అని అల్లు అర్జున్ పేర్కొన్నారు.