ఇక మీదట విశ్వరూపమే.. వైల్డ్ ఫైర్ అయిన అల్లు అర్జున్

Entertainment Published On : Tuesday, December 24, 2024 01:40 PM

పుష్ప2 మూవీ ప్రీమియర్ షో నేపథ్యంలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే.  ఈ ఘటన ఇప్పుడు ఒకవైపు ఇండస్ట్రీలో మరోవైపు రాజకీయంగా కూడా రచ్చ మారింది. దీనిపై కాంగ్రెస్ మండిపడుతుండగా.. బీజేపీ, బీఆర్ఎస్ లు మాత్రం అల్లు అర్జున్ కు సపోర్ట్ గా నిలుస్తున్నట్లు తెలుస్తొంది.

రేవంత్ రెడ్డి ఏకంగా అసెంబ్లీలో పుష్ప 2 సినిమా తొక్కిసలాట మీద మాట్లాడటం పెనుదుమారంగా మారింది. అల్లు అర్జున్ రావడం వల్లే.. ఈ ఘటన జరిగిందన్నారు. దీనికి కౌంటర్ గా బన్నీ సైతం ప్రెస్ మీట్ పెట్టి మరీ తన క్యారెక్టర్ ను దెబ్బతీసేలా కొంత మంది మాట్లాడుతున్నారన్నారు. అయితే.. ఈ క్రమంలో తాజాగా, అల్లు అర్జున్ ఎక్స్ వేదికగా మరో సంచలన పోస్ట్ చేశారు.

అల్లు అర్జున్ తన ఎక్స్ ఖాతాలో.. తన అభిమానులు బాధ్యతాయుతంగా పోస్ట్ లు పెట్టాలన్నారు. ఎవర్ని ఉద్దేశించి గానీ.. వ్యక్తిగతంగా కానీ కామెంట్లు చేసే పనులు చేయోద్దని అన్నారు. కొంత మంది తన అభిమానులు అని చెప్పుకుంటూ.. ఫెక్ ఐడీలతో.. వివాదాస్పద పోస్టులు, కాంట్రవర్సీనీ క్రియేట్ చేస్తున్నారని, అలాంటి వారిపై లీగల్ గా చర్యలు తీసుకుంటామని కూడా వార్నింగ్ ఇచ్చారు. 

అదే విధంగా నెగెటివ్ పోస్టులు పెట్టేవారికి దూరంగా ఉండాలన్నారు. దీంతో ప్రస్తుతం అల్లు అర్జున్ ఎక్స్ లో పెట్టిన పోస్ట్ కాస్త వార్తలలో నిలిచింది. మరొవైపు తెలంగాణ డీజీపీ సైతం.. అల్లు అర్జున్ తొక్కిసలాట ఘటనపై మాట్లాడారు. తమకు ప్రజలు సెఫ్టీ ముఖ్యమన్నారు. సెలబ్రీటీలు, ప్రజలు అందరు తమకు ఒకటే అన్నారు.