అల్లు అర్జున్ అరుదైన ఘనత
అల్లు అర్జున్ అరుదైన ఘనత సాధించారు. 'పుష్ప-2'తో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన మరో ఘనత సాధించారు. సినీవర్గాలు ప్రతిష్ఠాత్మకంగా భావించే 'ది హాలీవుడ్ రిపోర్టర్' మ్యాగజైన్ కవర్ పేజీపై స్థానం దక్కించుకున్నారు.
నటుడిగా తనకు 5.5 రేటింగ్ మాత్రమే ఇచ్చుకుంటానని మ్యాగజైను ఇంటర్వ్యూలో బన్నీ చెప్పడం ఆసక్తిరంగా మారింది. కాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మైథలాజికల్ సినిమా చేసేందుకు ఆయన ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.