సంక్రాంతి బరిలో నిలిచిన అల్లు అర్జున్, మహేష్ బాబు

Entertainment Published On : Friday, January 17, 2020 04:00 PM

సంక్రాంతి వేడుకలు దగ్గరపడుతున్నాయి. అలాగే మనం ఎంతగానో ఎదురుచూస్తున్న మన ఫేవరేట్ హీరోల సినిమాలు ఒకేసారి వస్తుండటంతో ఈ సంక్రాతి పండగ సంబరాలు రెట్టింపు కానున్నాయి. సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) నటించిన 'సరిలేరు నీకెవ్వరు' జనవరి 11న, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నటించిన 'అల వైకుంఠపురములో' జనవరి 12న కేవలం ఒక్కరోజు తేడాతో విడుదల అవుతుండటంతో ఫ్యాన్స్‌లో ఎక్సైట్‌మెంట్ పెరిగిపోతుంది.

ఈ సంక్రాంతి (Sankranti) బరిలో ఎవరు బ్లాక్ బస్టర్ కొడతారో అని ఫ్యాన్స్ ఆత్రుతతో ఉన్నారు. రెండు సినిమాలు సూపర్ హిట్ కావాలని కోరుకుంటూ రెండు సినిమాలకు కలిపి ఒకేసారి టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటున్నారు.ఇప్పటికే ఈ సినిమాల థియేట్రికల్ ట్రైలర్లు విడుదలయ్యాయి. యూట్యూబ్‌లో ఈ రెండు సినిమాల ట్రైలర్లు టాప్ 1 మరియు టాప్ 2 ట్రెండింగ్‌లో దూసుకుపోతున్నాయి. అయితే ఈ రెండింటిలో ఎవరి ట్రైలర్ బాగుంది అని, ఫ్యాన్స్ మధ్య విపరీతమైన చర్చ జరుగుతోంది.