అందం కోసం సర్జరీ.. స్పందించిన నటి!
లుక్స్ విషయంలో బాలీవుడ్ నటి మౌనీ రాయ్ కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు. అందం కోసం ఆమె సర్జరీ చేయించుకున్నారని కామెంట్స్ చేశారు. వీటిపై తాజాగా మౌనీ రాయ్ స్పందించింది. “నాపై కామెంట్స్ చేసేవాళ్లు నాకు కనిపించరు. కాబట్టి వాళ్ల మాటలకు బాధపడాల్సిన అవసరం లేదు. ఇతరులను ట్రోల్ చేస్తూ ఆనందాన్ని పొందాలనుకుంటే మాత్రం మనం ఏం చేస్తాం. ఎవరికి నచ్చినట్లు వాళ్లని ఉండనివ్వండి" అన్నారు.