హీరోయిన్ పవిత్ర స్నానం.. అభిమానుల అతి
మహా కుంభమేళాలో ఇటీవల సినీ నటి కత్రినా కైఫ్ పవిత్ర స్నానం ఆచరించారు. ఆమె స్నానం చేస్తుండగా పలువురు వీడియోలు, ఫొటోల కోసం ఎగబడ్డారు. ఓ వ్యక్తి ఆమె పక్కనే నిలబడి సెల్ఫీలు తీసుకుంటూ జోక్స్ కూడా వేశారు.
ఇక్కడ నేను, నా సోదరుడు, కత్రినా ఉన్నారు అని వెకిలిగా నవ్వారు. ఈ ఘటనపై మరో నటి రవీనా టాండన్ మండిపడ్డారు. ఇది చాలా అసహ్యంగా ఉందని, శాంతియుతంగా, ప్రశాంతంగా ఉండాల్సిన క్షణాలను ఇలాంటి వ్యక్తులు నాశనం చేస్తారని మండిపడ్డారు.