కొత్త లుక్ లో అదరగొట్టిన చిరు: ఫోటోలు
మెగాస్టార్ చిరంజీవి ఇతర సెలబ్రిటీల మాదిరిగా కాకుండా చాలా పొందికగా సోషల్ మీడియాలోకి వస్తుంటారు. అయితే, తాజాగా చిరంజీవి కొత్త లుక్కులో కొన్ని ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. వయసు పెరగడం కాకుండా రివర్స్ లో వయసు తగ్గుతోందా అన్నట్లుగా ఉన్నాయి చిరు ఫోటోలు. ఇప్పుడు బయటికొచ్చిన ఫోటోలు చూస్తే నిజమే అనకుండా ఉండలేం. లేటెస్ట్ ఫోటో షూట్ లో చిరు చాలా యంగ్ గా కనిపిస్తున్నారు. ఇక మెగాస్టార్ నటించిన విశ్వంభర చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఆ తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో మరో మూవీలో చిరు నటించనున్నారు.