విజయ్ దేవరకొండపై రూమర్
పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో నటుడిగా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ... 'గీత గోవిందం'తో రూ.100 కోట్ల క్లబ్ హీరోగా మారి తన రేంజి మరింత పెంచుకున్నాడు. ఆయన చేసిన 'టాక్సీవాలా' రిలీజ్ ముందే లీక్ అయినా మంచి లాభాలు తెచ్చే స్థాయిలో బాక్సాఫీస్ బిజినెస్ చేసిందంటే విజయ్ సినిమాలకు ఉన్న డిమాండ్, క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం భరత్ కమ్మ దర్శకత్వంలో 'డియర్ కామ్రేడ్' చిత్రం చేస్తున్న విజయ్.. దీని తర్వాత 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' మూవీ ఫేం క్రాంతి మాధవ్‌తో మరో సినిమా చేయబోతున్నాడు. 2020 వరకు తన కాల్షీట్లు ఖాళీ లేనంత బిజీగా ఉన్నడు ఈ యంగ్ స్టార్.
ఫ్యూచర్ సినిమాల కోసం అయినా విజయ్ డేట్స్ దక్కించుకోవాలని పలువురు నిర్మాతలు పోటీ పడుతున్నారు. ఇందుకు కారణం విజయ్ సినిమాలకు మంచి బిజినెస్ జరుగుతుండం, ప్రాపిట్స్ కూడా అదే స్థాయిలో ఉండటమే.
తెలుగు టాప్ ప్రొడ్యూసర్లలో ఒకరైన దిల్ రాజు సైతం.. విజయ్ దేవరకొండతో సినిమా చేయడానికి అతడితో సంప్రదింపులు జరిపినట్లు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే విజయ్ డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్‌తో దిల్ రాజు కంగుతిన్నట్లు చర్చించుకుంటున్నారు.
విజయ్ దేవరకొండ రూ. 10 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో... దిల్ రాజు ఆలోచనలో పడినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గీత గోవిందం, టాక్సీవాలా మంచి విజయం సాధించడంతో పాటు భారీ లాభాలు తేవడంతో విజయ్ తన రెమ్యూనేషన్ పెంచినట్లు చర్చించుకుంటున్నారు