22 ఏళ్ల అమ్మాయితో 48 ఏళ్ల నటుడి పెళ్లి
22 ఏళ్ల అమ్మాయిని 48ఏళ్ల నటుడు పెళ్లి చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ నటుడు, యూట్యూబర్ సాహిల్ ఖాన్ 48 ఏళ్ల వయసులో వాలంటైన్స్ డే సందర్భంగా తన ప్రియురాలైన 22 ఏళ్ల మిలేనా అలెగ్జాండ్రాను వివాహం చేసుకున్నారు.
దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాలో వీరిద్దరి వివాహం జరిగింది. దీనికి సంబంధించిన ఫొటోలను ఆయన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. సాహిల్ గతంలో నార్వేజియన్ నటి నెగర్ ఖాన్ను వివాహం చేసుకోగా రెండేళ్లకే విడిపోయారు.