అక్కా అని పిలిచి బస్సులోకి ఎక్కించి దారుణానికి ఒడిగట్టాడు

Crime Published On : Friday, February 28, 2025 11:00 AM

అక్కా.. నువ్వు ఎక్కాల్సిన బస్సు అక్కడుంది అంటూ స్టాండ్‌ పార్కింగ్‌లో ఆగి ఉన్న ఆర్టీసీ బస్సులోకి ఓ మహిళ (26)ను ఎక్కించి అత్యాచారానికి పాల్పడిన ఘటన మహారాష్ట్రలోని పుణేలో తీవ్ర సంచలనంగా మారింది. 

సతారా జిల్లాలోని ఫల్తానాకు చెందిన ఓ మహిళ ఇళ్లలో పని చేస్తుంటుంది. అందులో భాగంగా తెల్లవారుజామున బస్టాండ్‌లో బస్సు కోసం ఎదురుచూస్తోంది. ఓ దుర్మార్గుడు ఆమె దగ్గరకు వెళ్లి మాయ మాటలతో నమ్మించి ఆమె ఎక్కాల్సిన బస్సు ఇక్కడ లేదని పక్కన పార్క్‌ చేశారంటూ నమ్మించాడు. అనంతరం తన వెంట తీసుకెళ్లాడు. అక్కడ చీకటిగా ఉండటంతో ఆమె వెనకడుగు వేసినప్పటికీ బస్సులో ప్రయాణికులు నిద్రపోతున్నారని, అందుకే లైట్లు ఆర్పేశారంటూ నమ్మించాడు. ఆమె బస్సు ఎక్కగానే లోపలికి వెళ్లి తలుపు వేసి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత కామాంధుడు పరారీ కాగా మహిళ మాత్రం మరో బస్సు ఎక్కి జరిగిన దారుణం గురించి స్నేహితురాలికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

పుణెలోని ఓ పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలో పార్కు చేసిన బస్సులో ఈ దారుణం చోటుచేసుకోవడం కలకలం రేపుతోంది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించడంతో గుట్టురట్టు అయింది. నిందితుడిని దత్తాత్రేయ రాందాస్‌గా తేల్చారు. అతడికి గతంలో నేర చరిత్ర ఉన్నట్లు గుర్తించి నిందితుడిని పట్టుకునేందుకు ఎనిమిది ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...