రోజంతా నైటీలో ఉండమంటున్నారని ఓ మహిళ ఫిర్యాదు
భర్త, అత్తమామలు తనను రోజంతా నైటీలోనే ఉండాలని వేధిస్తున్నారంటూ అహ్మదాబాద్ కు చెందిన ఓ మహిళ(21) పోలీసులను ఆశ్రయించారు. తమకు 2023 మేలో పెళ్లెందని, అప్పటి నుంచీ అత్తింటి కుటుంబం వేధిస్తోందని ఫిర్యాదులో తెలిపారు. భర్త మద్యానికి బానిసై హింసిస్తున్నారని, అతడికి అత్తామామలు అండగా ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కలిసుండేందుకు తాను ప్రయత్నించినా భర్త వదిలేశారని, అతడి కుటుంబంపై చర్యలు తీసుకోవాలని విన్నవించారు.