నరికి ముక్కలు చేసి డ్రమ్‌లో వేస్తా..ఓ భర్తకు భార్య బెదిరింపులు
మీరట్ లో నేవి మర్చంట్ అధికారిని సొంత భార్య ముక్కలు చేసి డ్రమ్‌లో వేసిన దారుణ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. తననూ అదే విధంగా చంపుతానని భార్య బెదిరిస్తోందంటూ ఉత్తర ధర్మేంద్ర అనే భర్త పోలీసులను ఆశ్రయించారు.
'నా భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రశ్నించానని నన్ను కొడుతోంది. చంపేస్తాంటోంది' అని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ ఆరోపణల్ని భార్య ఖండించారు. భర్త తన చెల్లెలిపై కన్నేశారని, ఆమెతో పెళ్లి కోసం తనపై నిందలు వేస్తున్నారని ఎదురు ఆరోపించారు.