పెళ్లైన రెండు వారాలకే భర్తను చంపించిన భార్య
అక్రమ సంబంధాలకు అడ్డుగా ఉన్నారని భార్యలే భర్తలను చంపుతున్నారు. మీరట్ లో మర్చంట్ నేవి అధికారి హత్య మరువక ముందే ఉత్తర ప్రదేశ్ లోని మైన్పురి జిల్లాలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. దిలీప్ యాదవ్, ప్రగతీ యాదవ్ కు రెండు వారాల క్రితం పెళ్లి అయింది.
బలవంతపు పెళ్లి చేయడం, ప్రగతికి ప్రియుడిపై ఇష్టం ఉండటంతో రెండు వారాలకే భర్త దిలీప్ యాదవ్ ను కిరాయి హంతకులకు డబ్బిచ్చి చంపించింది. తన భర్త వద్ద బాగా ఆస్తి ఉందని, చంపేశాక సుఖంగా బతకొచ్చని ప్రియుడికి చెప్పింది. దిలీప్ శవం దొరికడంతో పోలీసుల దర్యాప్తు చేపట్టారు. దాంతో ప్రగతి ప్లాన్ బయటకొచ్చింది.